. కమిషనర్ ఎన్.మౌర్య
తిరుపతి : నగర్ పరిధిలో అర్హులైన వీధి విక్రయదారులు గుర్తించి అందరికీ నగరపాలక సంస్థ తరపున గుర్తింపు కార్డులు త్వరలో అందిస్తామని కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. వీధి విక్రయదారులను గుర్తించడం, నిబంధనలపై వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీలు, ఆర్.పిలకు బుధవారం కచ్చపి ఆడిటోరియం లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వీధి విక్రయదారుల పై జరుగుతున్న సర్వే పారదర్శకంగా ఉండాలని అన్నారు. ఈ సర్వే రెండు మూడు రోజుల లోపల పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంకా సర్వే లో నమోదు కాని వీధి విక్రయదారులను సంబంధిత వార్డ్ వెల్ఫేర్ సెక్రెటరీ, ఆర్.పిలతో నమోదు చేయించాలని అన్నారు. సర్వే పూర్తౌెన వెంటనే గుర్తించబడిన వీధి విక్రయదారులకు నగరపాలక సంస్థ ఆమోదంతో గుర్తింపు కార్డులను పంపిణి చేయడం జరుగుతుందని అన్నారు. ఎవరైనా ఇతరులు గుర్తింపు కార్డులు ఇస్తే అవి చెల్లవని తెలిపారు. గుర్తింపు కార్డుల కొరకు 200 రూపాయలు ఇండియన్ బ్యాంకు టౌన్ వెండిరగ్ కమిటీ, తిరుపతి అకౌంట్ (ూః ం/ఞ` 8074122243) నకు జమ చేయాలని తెలిపారు. అనంతరం వెండిరగ్ జోన్స్ ను ఏర్పాటు చేసి, కొన్ని గ్రీన్ జోన్స్ (ఫ్రీ వెండిరగ్ జోన్స్), అంబర్ జోన్స్ (రిస్ట్రిక్టేడ్ వెండిరగ్ జోన్స్) మరియు రెడ్ జోన్స్ (నో వెండిరగ్ జోన్స్) ఏర్పాటు చేస్తామని అన్నారు. గ్రీన్ జోన్ నందు పూర్తిగా వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇస్తారని, అంబర్ జోన్ నందు నిర్ణీత సమయము నందు మాత్రమే వ్యాపారం చేసుకోవచ్చునని, రెడ్ జోన్ నందు పూర్తిగా వ్యాపారము చేసుకోరాదని తెలిపారు. నగరపాలక సంస్థ గుర్తింపు కార్డు ఉన్న వారిని మాత్రమే వ్యాపారం చేసుకొనుటకు అనుమతిస్తారని తెలిపారు. గుర్తింపు పొందిన వీధి విక్రయదారుల నుండి ఎటువంటి రుసము ఎవ్వరికీ చెల్లించనవసరము లేదని తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ మంజూరు చేసిన గుర్తింపు కార్డు మాత్రమే చెల్లుబాటు అవుతాయని, మరి ఏ ఇతర ప్రైవేటు వ్యక్తులు మంజూరు చేసిన ఐ.డి కార్డులు చెల్లవని కూడా తెలిపారు. ఈ కార్యక్రమములో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మెప్మా సి.యం.యంలు కృష్ణవేణి, సోమ కుమార్, సిఓలు, స్ట్రీట్ వెండార్స్ యూనియన్ నాయకులు శివ కుమార్, తదితరులు పాల్గొన్నారు.