. అభినందించి పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ
సిద్దిపేట : అతి ఉత్కృష్ట సేవా పథక్ ఎంపికైన త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, మర్యాదపూర్వకంగా సిపి కలిశారు ఈ సందర్భంగా సిపి అభినందించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ. అతి ఉత్కృష్ట సేవా పథక్ త్వరలో అందజేస్తామని తెలిపారు. ప్రతిభ కనబరిచే అధికారులను సిబ్బందిని గుర్తించి వారిని ప్రోత్సహించే విధంగా రివార్డులు, అవార్డులు, సేవా పతకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజల కోసం అంకితభావంతో విధులు నిర్వహించి ప్రజలకు ఎల్లవేళలా సేవలు అందించడానికి అందుబాటులో ఉండాలని తెలిపారు. మరియు ప్రతి ఒక్కరూ ఫంక్షనల్ వర్టికల్ వారిగా పోటీపడి విధులు నిర్వహించి రివార్డులు, అవార్డులు పొందాలని సూచించారు. కష్టపడి అంకితభావంతో విధులు నిర్వహించే వారికి ఏదో ఒక రోజు తప్పకుండా డిపార్ట్మెంట్లో గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఇలాంటి రీమార్క్ లేకుండా 25 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న విద్యాసాగర్ కు సేవా పథకానికి ఎంపిక కావడం జరిగింది.